: ఆదిలోనే వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. క్రీజులోకి రాగానే వెనుదిరిగిన గుప్తిల్
విశాఖపట్నంలో జరుగుతున్న భారత్, న్యూజిలాండ్ ఫైనల్ వన్డే మ్యాచ్‌లో టీమిండియా న్యూజిలాండ్ ముందు 270 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన సంగతి తెలిసిందే. లక్ష్యసాధనలో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఓపెనర్లు తడబడ్డారు. ఒక్క పరుగు కూడా చేయకుండానే టీమిండియా బౌలర్ ఉమేష్ యాదవ్ విసిరిన బంతికి గుప్తిల్ వెనుదిరిగాడు. క్రీజులో లాథమ్, విలియమ్సన్ బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోరు రెండు ఓవర్లకి 7 పరుగులుగా ఉంది.