: ఫైనల్ వన్డేలో న్యూజిలాండ్ ముందు 270 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన టీమిండియా
విశాఖలోని పోతిన మల్లయ్యపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ రాజశేఖరరెడ్డి స్టేడియంలో జరుగుతున్న భారత్, న్యూజిలాండ్ ఫైనల్ వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్ ముందు టీమిండియా 270 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా ఆటగాళ్లలో రహానే 20, రోహిత్ శర్మ 70, విరాట్ కోహ్లీ 65, ధోనీ 41, జాధవ్ 37, అక్షర్ 24, యాదవ్ 1 పరుగులు చేశారు. టీమిండియాకి ఎక్స్‌ట్రాల రూపంలో మరో 9 పరుగులు వచ్చాయి. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్, సోధీలకు చెరో రెండు వికెట్లు దక్కాయి. నీషాం, సాంత్నర్‌లకు చెరో వికెట్టు లభించింది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడానికి భారత బౌలర్లు చెమటోడ్చాల్సిందే.