: మరోసారి కాల్పులకు తెగబడిన పాక్ రేంజర్లు.. మహిళ‌ల‌కు గాయాలు


భార‌త్‌-పాక్ స‌రిహ‌ద్దుల్లో పాకిస్థాన్ రేంజ‌ర్ల కాల్పుల‌కు భార‌త సైన్యం దీటైన జ‌వాబు ఇస్తున్న‌ప్ప‌టికీ, ఈ రోజు మ‌రోసారి వారు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. జ‌మ్ముక‌శ్మీర్‌లోని కుప్వారా జిల్లా కీరస్ సెక్టార్‌లో ఈ రోజు మ‌ధ్యాహ్నం పాక్ రేంజ‌ర్లు మ‌రోసారి కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి తూట్లు పొడిచారు. ఆ ప్రాంతంలో పాక్ రేంజ‌ర్లు కాల్పుల‌కు తెగబడ‌డంతో ప‌లువురు మ‌హిళ‌లు గాయాల‌పాల‌య్యారు. పాక్ రేంజ‌ర్ల కాల్పుల‌ను భార‌త సైన్యం తిప్పికొట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. పాకిస్థాన్ చర్యలతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు భయపడిపోతున్నారు.

  • Loading...

More Telugu News