: సైనికులకు సంబంధించి మోదీకి ఘాటు లేఖ రాసిన రాహుల్ గాంధీ


సైనికుల ఆత్మస్థైర్యం, మనోభావాలు దెబ్బతినేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. పెన్షన్ పొందే విషయంలో సైనికులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకూడదని... వన్ ర్యాంక్-వన్ పెన్షన్ విధానాన్ని అర్థవంతంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. గత కొన్ని రోజులుగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు సైనికుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని లేఖలో ఆయన విమర్శించారు. అంగవైకల్యానికి సంబంధించిన పెన్షన్ విధానాన్ని స్లాబ్ విధానంగా మార్చారని... దీని వల్ల వీర సైనికుల పెన్షన్ గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉందని అన్నారు. ఏడో వేతన సవరణ సంఘం కూడా సైనికులకు తీవ్ర నిరాశనే మిగిల్చిందని చెప్పారు. సాధారణ ఉద్యోగులతో పోలిస్తే... సైనికోద్యోగుల వేతన విషయంలో ఎంతో తేడా కనిపిస్తోందని అన్నారు.

  • Loading...

More Telugu News