: ‘కేసీఆర్ కు ఫస్టు ర్యాంక్’ వార్తతో తెలంగాణ భవన్‌లో సంబురాలు చేసుకున్న టీఆర్ఎస్ శ్రేణులు


వీడీపీ అసోసియేట్స్ నిర్వహించిన సర్వేలో దేశంలోనే అత్యంత జనాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీపావ‌ళి పండుగ‌కు ముందు వ‌చ్చిన ఈ శుభ‌వార్త‌తో తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందం మిన్నంటింది. హైద‌రాబాద్‌లోని తెలంగాణ భ‌వ‌న్‌లో వారు సంబురాలు చేసుకున్నారు. పార్టీ నేత‌లు, కార్యకర్తలు బాణసంచా కాల్చి ఆనందంగా గ‌డిపారు. ఈ సంబురాలు టీఆర్ఎస్‌ పార్టీ నగర అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు ఆధ్వర్యంలో జ‌రిగాయి. అందులో ఎంపీ బాల్క సుమన్‌, జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొని కేసీఆర్ ఫొటోకు పాలాభిషేకం చేశారు.

  • Loading...

More Telugu News