: ఐదు రాష్ట్రాల్లో బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు
ఆంధ్ర-ఒడిశా బోర్డర్ లో జరగిన ఎన్ కౌంటర్ కు నిరసనగా మావోయిస్టులు బంద్ కు పిలుపునిచ్చారు. నవంబర్ 3వ తేదీన ఐదు రాష్ట్రాల్లో బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో బంద్ ను విజయవంతం చేయాలని కోరింది. ఈ నెల 24న జరిగిన ఎన్ కౌంటర్ లో 30 మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే.