: విశాఖ వన్డే: 70 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ శర్మ అవుట్.. క్రీజులోకి ధోనీ
విశాఖ వన్డేలో దూకుడుగా ఆడుతూ వచ్చిన టీమిండియా బ్యాట్స్‌మెన్ రోహిత్‌శర్మ 70 పరుగుల (65 బంతుల్లో) వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. బౌల్ట్ విసిరిన బంతికి భారీ షాట్ కి ప్రయత్నించిన రోహిత్.. నీషామ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి మహేంద్ర సింగ్ ధోనీ వచ్చాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 20 ఓవర్లకి 119/2 గా ఉంది. 30 బంతులను ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ 22 పరుగులతో క్రీజులో ఉన్నాడు. న్యూజిలాండ్ బౌలర్లలో నీషామ్, బౌల్ట్ లకి చెరో వికెట్ దక్కింది.