: 100 మార్కును దాటిన టీమిండియా స్కోరు.. అదరగొడుతున్న రోహిత్ శర్మ.. హాఫ్ సెంచరీ
విశాఖలోని పోతిన మల్లయ్యపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ రాజశేఖరరెడ్డి స్టేడియంలో జరుగుతున్న వన్డేలో టీమిండియా బ్యాట్స్‌మెన్ రోహిత్‌శర్మ అద్భుతంగా రాణిస్తున్నాడు. హాఫ్ సెంచరీ సాధించిన కోహ్లీ ప్రస్తుతం 61 పరుగులతో క్రీజులో ఉన్నాడు. టీమిండియా స్కోరు 100 పరుగుల మార్కును దాటింది. 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టీమిండియా ఓపెనర్ రహానే న్యూజిలాండ్ బౌలర్ నీషామ్ బౌలింగ్‌లో అవుటయిన తరువాత మైదానంలోకి వచ్చిన విరాట్ కోహ్లీ 20 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 19 ఓవర్లికి 106 పరుగులుగా ఉంది.