: ఇదే భారీ ఎన్ కౌంటర్... 4 రాష్ట్రాల నేతలు మరణించారు... భారీ మూల్యం చెల్లించక తప్పదు: మావోయిస్టు కేంద్ర కమిటీ


ఆంధ్ర-ఒడిశా బోర్డర్ లో జరిగిన ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ స్పందించింది. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఎన్ కౌంటర్ తో మొదటిసారి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి ప్రతాప్ తెలిపారు. ఏపీ, తెలంగాణ, ఒడిశా, చత్తీస్ గఢ్ రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు నేతలు ఈ ఎన్ కౌంటర్ లో మృతి చెందారని చెప్పారు. ఎదురు కాల్పుల్లో గాయపడ్డ మరో 11 మంది మావోలు ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారని... అయినా, తమ దగ్గర ఎవరూ లేరంటూ పోలీసులు నాటకం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవర్ట్ ఆపరేషన్ తోనే తమపై దాడి జరిగిందని... ఎన్ని కోవర్ట్ ఆపరేషన్లు జరిగినా మావోయిస్టు పార్టీ భయపడదని చెప్పారు. జరిగిన దానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. బాక్సైట్ గనుల కోసం ఏపీ సీఎం చంద్రబాబు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లు యత్నిస్తున్నారని విమర్శించారు. మైనింగ్ ను అడ్డుకుంటున్న ఆదివాసీలను బెదిరిస్తున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News