: నా సినిమాలో పాక్ నటి ఉన్నా ఆర్మీకి విరాళం ఇవ్వను: ఫర్హాన్ అఖ్తర్


బాలీవుడ్ సినిమాలో పాకిస్థాన్ నటులు ఉంటే ఆర్మీకి రూ. 5 కోట్ల విరాళం ఇవ్వాలని ఎమ్మెన్సెస్ డిమాండ్ చేయడాన్ని బాలీవుడ్ నటుడు, నిర్మాత ఫర్హాన్ అఖ్తర్ ఖండించాడు. కరణ్ జొహార్ నిర్మించిన 'యే దిల్ హై ముష్కిల్' సినిమాలో పాక్ నటుడు ఫవాద్ ఖాన్ నటించినందుకు... ఆర్మీకి రూ. 5 కోట్ల విరాళం ఇవ్వాలని ఎమ్మెన్నెస్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి వాటికి తాను మద్దతు ఇవ్వనని ఫర్హాన్ స్పష్టం చేశాడు. సినిమాను తాము చట్టబద్ధంగా నిర్మించినప్పుడు... సినిమా విడులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ఆయన తెలిపాడు. షారుఖ్ ఖాన్ తో 'రయీస్' సినిమాను ఫర్హాన్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో పాక్ నటి మహీరా ఖాన్ నటిస్తోంది. ఈ సినిమా 2017 జనవరిలో విడుదల కానుంది.

  • Loading...

More Telugu News