: పంజాగుట్టలో అగ్నిప్రమాదం.. స్తంభించిన రాకపోకలు
హైదరాబాద్లోని పంజాగుట్టలో కార్ డెకార్స్ దుకాణంలో కొద్దిసేపటి క్రితం అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి రెడ్డి ల్యాబ్స్ కు ఎదురుగా ఈ దుకాణం ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు అగ్నిమాపక వాహనాలతో అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడి, వాహనాల రాకపోకలు స్తంభించాయి.