: పాక్ గూఢచారికి సమాజ్ వాదీ పార్టీ ఎంపీ పిఏ సాయం


పాకిస్తాన్ గూఢచారులకు సమాజ్ వాదీ పార్టీ ఎంపీ పీఏ సాయం చేశారని తెలుస్తోంది. గూఢచర్యం చేస్తూ రక్షణ సమాచారం కలిగి ఉన్నారంటూ ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయ ఉద్యోగి అక్తర్ ను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, దౌత్యపరమైన కారణాల వల్ల ఆయనను విడిచిపెట్టి 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. అతనిని విచారించిన సందర్భంగా, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ చౌదరి మునావ్వర్ సలీమ్ పీఏ ఫర్హాత్ సాయం చేశాడని వెల్లడించారు. దీంతో ఫర్హాత్ ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విదేశాంగ శాఖకు సంబంధించిన కీలక పత్రాలను ఫర్హత్ నుంచి అక్తర్ కు చేరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దీనిపై ఎంపీ చౌదరిని వివరణ ఇవ్వాలని పార్టీ కోరనున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News