: ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా
భారత్, న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. విశాఖలోని పోతిన మల్లయ్యపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ రాజశేఖరరెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా రహానే, రోహిత్ శర్మ క్రీజులోకి వచ్చారు. జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. నాలుగో వన్డేలో పెద్దగా ప్రభావం చూపని హార్థిక్ పాండ్యా, ధవల్ కులకర్ణి స్థానంలో బుమ్రా, జయంత్ యాదవ్ లకు ఫైనల్ మ్యాచ్ లో ఆడేందుకు చోటు కల్పించారు. 2-2తో సిరీస్‌లో ఇరు జట్లు సమంగా ఉండడంతో ఐదో వన్డేపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ వన్డేలో గెలిచిన వారికే కప్ దక్కనుండడంతో ఇరు జట్లు గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి.