: స్కాంలో కొల్లగొట్టిన డబ్బుతో షాగీ కొన్న కారు క్రికెటర్ కోహ్లీది!


కాల్ సెంటర్ స్కాంతో అమెరికాలో ఉంటున్న వారి నుంచి వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన సాగర్ థక్కర్ అలియాస్ షాగీ ఏకంగా రూ. 2.5 కోట్లు ఖర్చు చేసే ఆడీ ఆర్8 కారును కొనుగోలు చేశాడు. ఈ కారు మరెవరిదో కాదు, టిమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీది. అక్రమంగా కొల్లగొట్టిన సంపాదనతో కొన్న ఈ కారును హర్యానాలో దాచిపెట్టినట్టు పోలీసులు వెల్లడించారు. గురువారంనాడు ఈ కారును అహ్మదాబాద్ లో సీజ్ చేశారు. గత మే నెలలో ఈ కారును షాగీ కొనుగోలు చేశాడని... కాల్ సెంటర్ స్కాం గురించి తెలియని కోహ్లీ తన కారును షాగీకి విక్రయించాడని థానే పోలీస్ కమిషనర్ తెలిపారు. కాల్ సెంటర్ స్కాంలో కొల్లగొట్టిన డబ్బుతోనే షాగీ ఈ కారు కొన్నాడని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News