: గన్నవరం విమానాశ్రయంలో జేసీ దివాకర్ రెడ్డి చిందులు


టీడీపీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గన్నవరం విమానాశ్రయంలో చిందులు తొక్కారు. ఎయిర్ ఇండియా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన నిన్న చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ వెళ్లేందుకు విమానాశ్రయానికి కొంచెం ఆలస్యంగా జేసీ వచ్చారు. అప్పటికే బోర్డింగ్ క్లోజ్ అయింది. దీంతో, ఆయనలోని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 'నా టికెట్టే రద్దు చేస్తారా?' అంటూ అధికారులపై మండిపడ్డారు. అంతేకాదు, తనదైన శైలిలో తిట్ల పురాణం అందుకున్నారు. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై కూడా చిందులు తొక్కారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎయిర్ పోర్ట్ లాంజ్ రూమ్ లో ఉండగానే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News