: భయంతో అద్దాలు పగులగొట్టి బస్సులోంచి దూకేసిన ప్రయాణికులు
హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేటు బస్సులో ప్రయాణికులు బెంబేలెత్తిపోయిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. బస్సు నందిగామ చేరుకునే సరికి బస్సులో ఏసీ ఆగిపోయింది. ఏసీ పనిచేయకపోవడంతో అందులోంచి పొగలు కమ్ముకున్నాయి. బస్సును పొగలు చుట్టుముట్టడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యేసరికి ప్రయాణికులు బస్సు అద్దాలు పగులగొట్టి బస్సులోంచి దూకేశారు. ఈ క్రమంలో పలువురు గాయపడ్డారు. అనంతరం ఏసీ విభాగంలో తలెత్తిన సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించారు.