: శంషాబాద్ ఎయిర్ పోర్టులో మహిళ మిస్సింగ్ కలకలం
హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఖుష్బు అనే మహిళ మిస్సైన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే... ఖుష్బూ అనే మహిళ తన భర్తతో కలిసి దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చింది. ఈ దంపతులు కోల్ కతా వెళ్లాల్సి ఉంది. అయితే కనెక్టింగ్ ఫ్లైట్ కోసం ఎదురు చూసే క్రమంలో ఆమె మిస్సైంది. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు ఎయిర్ పోర్టులోని సీసీ టీవీ పుటేజ్ ను పరిశీలిస్తున్నారు. ఆమె ఎక్కడికి వెళ్లి ఉంటుందనే విషయమై ఆరా తీస్తున్నారు.