: సరిహద్దుల్లో భారత సైనికుడిని ముక్కలుగా నరికిన ఉగ్రవాదులు!


పాకిస్థాన్‌ కుక్కబుద్ధి చూపించుకుంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లుపొడుస్తూ, భారత పోస్టులు, సరిహద్దు గ్రామాలపై కాల్పులకు తెగబడింది. ఈ క్రమంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు బీఎస్ఎఫ్ కు చెందిన ఒక సైనికుడిని అత్యంత అమానుషంగా హతమార్చింది. కశ్మీర్‌ లో చొరబడ్డ ఉగ్రవాదులపై కాల్పులు జరుపుతూ వెళ్లిన సైనికుడిని ముక్కలు ముక్కలుగా నరికి చంపారు. కుప్వారా జిల్లాలోని మచ్చిల్ సెక్టార్ లో సైనికుడు తల, శరీర భాగాలను ఖండించారని బీఎస్ఎఫ్ తెలిపింది. అయితే ఇంతకు ఇంత తీర్చుకుంటామని వారు హెచ్చరించారు. ఈ దాడి సైనికుల సమక్షంలోనే జరిగి ఉంటుందని వారు అనుమానం వ్యక్తం చేశారు. కాగా, సరిహద్దుల్లోని కథువా సెక్టార్, కెరి, హిరానగర్‌, ఆర్ఎస్ పురా, మెందార్‌, పూంఛ్‌ సెక్టార్‌ లలో కాల్పులకు తెగబడిందని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News