: పార్టీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలపై వేలిముద్రలు వేసిన జయలలిత
ఊపిరితిత్తుల సమస్యతో నెల రోజులుగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏఐఏడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకున్నారనేందుకు సాక్ష్యం వెల్లడైంది. తమిళనాట అరవకురిచ్చి, తంజావూర్, తిరుప్పరంకుంద్రం అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బరిలో ఉన్న తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలపై ఆమె ఎడమచేతి వేలిముద్ర వేశారు. ఈ మేరకు పార్టీ ప్రకటన చేసింది. ఎన్నికల నిబంధనల ప్రకారం, పార్టీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలపై సదరు పార్టీ చీఫ్ సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె వేలిముద్రలు వేశారని పార్టీ వర్గాలు తెలిపాయి.