: పాకిస్థాన్ పిరికితనాన్ని ఇలా ప్రదర్శిస్తోంది: రాజ్ నాథ్ సింగ్


పాకిస్థాన్ కుటిల యుద్ధ తంత్రాన్ని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్రంగా తప్పుపట్టారు. గ్రేటర్ నోయిడాలోని ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు 55వ వ్యవస్థాపక దినోత్సం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిరికిపందలా వ్యవహరిస్తున్న పాకిస్థాన్‌ అందుకు ఉగ్రవాదాన్ని ఊతంగా తీసుకుంటోందని ఆక్షేపించారు. ఉగ్రవాదం పిరికివాళ్ల ఆయుధం అని ఆయన అన్నారు. ధైర్యమున్న వాళ్లు నేరుగా పోరాడతారని, అది లేని వాళ్లే వెనక నుంచి పోరాడతారని, వారినే పిరికిపందలంటారని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు పాకిస్థాన్‌ చేస్తున్నది అదేనని ఆయన మండిపడ్డారు. భారత్ తో ప్రచ్ఛన్న యుద్ధం చేస్తూ, దేశానికి హాని కలిగించే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. సరిహద్దుల్లోని 9వేల అడుగుల ఎత్తులో పర్వత ప్రాంతాల్లో ప్రతికూల పరిస్థితుల మధ్య బాధ్యతలు నిర్వహించే ప్రతి సైనికుడిని ‘హై అల్టిట్యూడ్‌ మెడల్‌’తో సత్కరిస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News