: సితార గెలిచేసింది... సమంత ట్వీట్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతల గారాలపట్టి సితార పోటీ లేకుండా గెలిచేసిందని ప్రముఖ నటి సమంత తెలిపింది. మహేష్‌బాబు, సమంత జంటగా నటించిన ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో సమంత చెప్పిన డైలాగును సితార చెప్పిన వీడియో నిన్న సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ డైలాగుతో పాటు సితారకు సంబంధించిన పలు వీడియోలను మహేష్ అభిమానులు కామెంట్లు, షేర్లతో హోరెత్తించారు. ఈ క్రమంలో, ఈ సినిమాలో సమంత చెప్పిన ‘ఏడు తరాలా.. వెతికితే దొరకనంత మందా..! కలిస్తే వదులుకోలేనంత మందా..!’ అనే డైలాగ్ ను సితార ముద్దు ముద్దుగా చెప్పింది. ఈ వీడియోను ఓ అభిమాని తయారు చేసి పెట్టగా, అదే వీడియోకు తను చెప్పిన వీడియోను జత చేసిన సమంత ట్వీట్ చేస్తూ... ‘పోటీ లేకుండా తనే గెలిచింది’ అంటూ కామెంట్ పెట్టింది. కాగా, సితార తన బెస్ట్ ఫ్రెండ్ అని సమంత గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఆడియో వేడుకలో కూడా సమంత ఒళ్లో కూర్చుని, ఆమెతో కబుర్లు చెబుతూ సితార సందడి చేసిన సంగతి తెలిసిందే.