: 232 మందిని హతమార్చిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు
ఇరాక్ లో సంకీర్ణ సేనలు, కుర్దు దళాల ధాటికి పలాయనం చిత్తగిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దురాగతాలకు పాల్పడడం మానడం లేదు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చేతుల్లోనే ఉండడంతో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. మోసుల్ దాని సమీప ప్రాంతాల్లో విరుచుకుపడ్డ ఉగ్రవాదులు 232 మంది ఇరాక్ మాజీ భద్రతాధికారులు సహా సాధారణ పౌరులను అత్యంత పాశవికంగా హత్య చేసినట్టు తెలుస్తోంది. వీరిలో 190 మంది ఇరాక్ మాజీ భద్రతాధికారులని ఐక్యరాజ్యసమితి హక్కుల కార్యాలయం తెలిపింది.