: చెన్నయ్ అపోలో ఆసుపత్రిలో చేరిన కల్కిభగవాన్
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ అస్వస్థతకు గురయ్యారు. చెన్నయ్ లోని అపోలో ఆసుపత్రిలో ఆయన అనారోగ్యంతో జాయిన్ అయ్యారు. ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కాగా, ఇప్పటికే అదే ఆసుపత్రిలో ముఖ్యమంత్రి జయలలిత చికిత్స పొందుతుండడంతో ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు కొనసాగుతోంది. దీంతో ఆసుపత్రికి కల్కి భగవాన్ భక్తులు పోటెత్తుతున్నా ఎవరినీ ఆసుపత్రిలోపలికి అనుమతించడం లేదు.