: నెల్లూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాస .. పరస్పరం దాడులు చేసుకున్న టీడీపీ, వైసీపీ సభ్యులు


నెల్లూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. వార్డుల్లో ఆక్రమణల తొలగింపు విషయమై టీడీపీ, వైఎస్సార్సీపీ సభ్యుల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. మొదట్లో పలు విషయాలపై సామరస్య పూర్వకంగానే చర్చించారు. అయితే, సమావేశం చివరిలో.. వార్డుల్లో ఆక్రమణల అంశం గురించి చర్చించే సమయంలో వాదోపవాదనలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో టీడీపీ కార్పొరేటర్ ప్రశాంత్ కిరణ్ పై వైఎస్సార్సీపీ సభ్యుడు అశోక్ దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత పరస్పరం దాడులు చేసుకున్నారు. అయితే, ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మేయర్ అబ్దుల్ అజీజ్, వైఎస్సార్సీపీ సభ్యుడు అశోక్ ను సస్పెండ్ చేసినట్లు ఆదేశించారు.

  • Loading...

More Telugu News