: రిపోర్టర్ అవతారమెత్తిన రోహిత్ శర్మ.. సహచరులను ఇంటర్వ్యూ చేసిన వైనం!


టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ రిపోర్టరు అవతారమెత్తాడు. తన సహచర క్రీడాకారులను ఇంటర్వ్యూ చేశాడు. ఈ సరదా సంఘటన రాంచీలో జరిగింది. నాల్గో వన్డే ముగిసిన అనంతరం క్రీడాకారులందరూ వైజాగ్ కు బయలుదేరుతున్న సమయంలో వెయిటింగ్ చేస్తున్న సందర్భంలో రోహిత్ శర్మ సరదాగా కాసేపు రిపోర్టర్ గా మారాడు. ఆ సన్నివేశాన్ని వీడియో కూడా చిత్రీకరించారు. ఈ ఇంటర్వ్యూలో మొదటగా, బౌలర్ ఉమేశ్ యాదవ్ దగ్గరకు వెళ్లిన రోహిత్, విమానంలో ఎలా గడుపుతావని ప్రశ్నించాడు. నిద్రపోవడానికే ఎక్కువ ఇష్టపడతానని ఉమేశ్ సమాధానమిచ్చాడు. ఆ తర్వాత, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ను ప్రశ్నించాడు. గత మ్యాచ్ లో వైఫల్యాలు, జరగబోయే మ్యాచ్ ల గురించి ఆలోచిస్తానని ఆయన సమాధానం చెప్పారు. అనంతరం, ఎక్కువగా సిగ్గు పడే వ్యక్తి, విమాన ప్రయాణంలో ఎక్కువగా కాఫీ తాగడానికి ఇష్టపడే వ్యక్తి అయిన రెహానే ని ప్రశ్నిద్దామంటూ వెళ్లాడు. దీనికి రహానె స్పందిస్తూ, ప్రయాణంలో కొంత సమయం నిద్రకు, మరికొంత సమయం పుస్తకాలు చదవడానికి కేటాయిస్తానని చెప్పాడు. స్పిన్నర్ అమిత్ మిశ్రాను ప్రశ్నించగా, సంజయ్ బంగర్ నుంచి బ్యాటింగ్ టిప్స్ నేర్చుకుంటానని చెప్పాడు. ఇలా సాగింది ఈ ఇంటర్వ్యూ!

  • Loading...

More Telugu News