: గోవా తొలి మహిళా ముఖ్యమంత్రి కన్నుమూత


కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోవా తొలి మహిళా ముఖ్యమంత్రి శశికళా కాకోద్కర్ (81) కన్నుమూశారు. పానాజీలోని అల్తిన్హో నివాసంలో ఆమె ఈరోజు సాయంత్రం మృతి చెందారు. కాగా, శశికళ తండ్రి దయానంద్ బండోద్కర్ కూడా ముఖ్యమంత్రిగా చేశారు. 1973లో ముఖ్యమంత్రిగా చేస్తున్న సమయంలోనే ఆయన కన్నుమూశారు. దీంతో, శశికళ గోవా తొలి మహిళా సీఎం అయ్యారు. 1973-79 మధ్య కాలంలో ఆమె సీఎంగా పనిచేశారు. కాగా, శశికళ మృతిపై గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ తన సంతాపం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News