: ఎయిర్‌బ్యాగ్స్‌లో లోపం కారణంగా భారీ మొత్తంలో టొయోటా కార్లు వెనక్కి


ప్రముఖ వాహన తయారీ సంస్థ టొయోటా చైనాలో భారీ మొత్తంలో కార్లను వెనక్కి పిలుస్తోంది. తాము తయారు చేసిన వియోస్‌, కరోలా, కరోలా ఎక్స్‌, యారిస్‌ మోడళ్లలో అమ‌ర్చిన‌ ఎయిర్‌ బ్యాగ్స్ లోపాల‌తో కూడి ఉన్నాయ‌ని గ్ర‌హించి 8,19,598 కార్లను వెనక్కి పిలుస్తున్నామ‌ని ఆ దేశ నాణ్యత పరీక్షా సంస్థ పేర్కొంది. ఈ కార్లు ఆగస్టు 29, 2013 నుంచి మే 1, 2017 మధ్య కాలంలో ఉత్ప‌త్తి అయ్యాయ‌ని చెప్పింది. కారులో సంస్థ అమ‌ర్చిన‌ ఎయిర్‌ బ్యాగులు గాలి ఒత్తిడికి సులభంగా చిరిగిపోయేలా ఉన్నాయ‌ని అధికారులు తెలిపారు. కారు ఒకవేళ‌ ప్రమాదానికి గురైతే ఈ లోపంతో ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. వ‌చ్చేనెల 30 నుంచి వినియోగ‌దారులకు టొయోటా డీలర్ల వద్ద ఎయిర్‌ బ్యాగులు ఉచితంగా మార్చి ఇస్తార‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News