: ఎంపీ అభ్యర్థులకు సీట్లను బేరం పెట్టడం కోసమే ‘హోదా కోసం రాజీనామా’ అనే డ్రామా: గాలి ముద్దుకృష్ణమ నాయుడు

ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పార్లమెంటులో విభజన బిల్లు పెట్టిన సమయంలో లోక్‌సభ సభ్యుడిగా ఉండి కూడా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించని జగన్ ఇప్పుడు హోదా కోసం త్యాగాలు చేస్తామంటూ మాట్లాడమేంటని ఆయన ప్రశ్నించారు. ఎంపీ అభ్యర్థులకు సీట్లను బేరం పెట్టడం కోసమే హోదా కోసం రాజీనామా అనే డ్రామాను ఆడుతున్నారని అన్నారు.