: అమరావతిలో అడ్మినిస్ట్రేటివ్ సిటీకి శంకుస్థాపన


ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో అపూర్వ ఘట్టానికి అడుగు పడింది. ప్రభుత్వ పరిపాలనా భవనాల సముదాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ కోడెల శివప్రసాదరావు, కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ భవన సముదాయంలో రాజ్ భవన్, సచివాలయం, శాసనసభ, శాసనమండలి, ముఖ్యమంత్రి నివాస భవనం, మంత్రులు, ప్రజాప్రతినిధుల నివాసాలు, ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాలు, అధికారులు, ఉద్యోగుల నివాస సముదాయాలు నిర్మిస్తారు. ఈ నిర్మాణాలను 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించారు. 950 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ నిర్మాణాలకు రూ. 5,600 కోట్ల ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.

  • Loading...

More Telugu News