: కాశ్మీర్ లోని బ్యాంకులను హెచ్చరించిన లష్కరే తోయిబా


నిరసనలు, ఆందోళనలు జరుగుతున్న సమయంలో బ్యాంకులను తెరవకూడదని ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హెచ్చరించింది. దక్షిణ కాశ్మీర్ లోని కొన్ని ప్రాంతాల్లో ఈ మేరకు పోస్టర్లు కనిపించాయి. కాశ్మీర్ లో అల్లర్లు జరుగుతున్న సమయంలో బ్యాంకులు తెరవకూడదని, తెరిస్తే కనుక సహించమని అందులో హెచ్చరించారు. బ్యాంకు వ్యాపార లావాదేవీలేమైనా ఉంటే సాయంత్రం 5 గంటల తర్వాతే చేసుకోవాలని అన్నారు. ఉద్యోగులను తమ విధులను నిర్వర్తించమని బలవంతపెట్టకూడదని డిప్యూటీ కమిషనర్లను హెచ్చరిస్తున్నట్లుగా ఆ పోస్టర్లలో ఉంది. ఈ హెచ్చరికలతో కాశ్మీర్ లోయలోని చాలా బ్యాంకులను మూసేశారు. శ్రీనగర్ జిల్లాలోని కొన్ని బ్యాంకులు మాత్రం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు తెరిచి ఉన్నాయి.

  • Loading...

More Telugu News