: విజయవాడలో అరుణ్ జైట్లీకి విందు ఇస్తోన్న చంద్రబాబు
విజయవాడలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని బీజేపీ నేతలు సన్మానించిన తరువాత ఆయన అక్కడి నుంచి బయలుదేరి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిశారు. విజయవాడ గేట్‌వే హోటల్‌కు చేరుకున్న జైట్లీకి చంద్రబాబు పలువురు మంత్రులతో కలిసి స్వాగతం పలికారు. ప్రస్తుతం జైట్లీకి చంద్రబాబు విందు ఇస్తున్నారు. ఈ విందులో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి, రాష్ట్రమంత్రులు, పలువురు ఎంపీలు, అధికారులు పాల్గొంటున్నారు. మరికాసేపట్లో జైట్లీతో రైతు సమాఖ్య ప్రతినిధులు సమావేశం కానున్నారు.