: గడ్కరీకి కుర్తాను, నితీశ్ కుమార్ కు పైజమాను పంపి అర్ధనగ్నంగా నిలబడ్డ బీజేపీ ఎమ్మెల్యే... మీరూ చూడండి!


ఎన్నిసార్లు అడిగినా రహదార్లు వేయించడం లేదన్న ఆగ్రహంతో బీహార్ ఎమ్మెల్యే వినూత్న రీతిలో అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. తన కుర్తాను విప్పి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి, పైజమాను విప్పి బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు పంపించారు. ఈ పనిచేసిన ఎమ్మెల్యే పేరు వినయ్ బిహారీ. గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. తన నియోజకవర్గంలోని మనువాపుల్ నుంచి నావల్ పుర్ రత్వాల్ వరకూ 44 కిలోమీటర్ల దూరాన్ని వేయించాలని చాలా రోజులుగా ఆయన కోరుతున్నారు. ఎన్నాళ్లైనా పనులు ప్రారంభం కాకపోవడంతో ఈ వినూత్న నిరసన చేపట్టారు. అన్నట్టు రోడ్డు నిర్మాణం ప్రారంభమయ్యే వరకూ తాను కుర్తా, పైజమాలు ధరించబోనని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News