: విజయవాడలో వెంకయ్యనాయుడిపై ప్రశంసల జల్లు కురిపించిన అరుణ్‌జైట్లీ
విజయవాడలో ఈ రోజు బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీని సన్మానించారు. అనంతరం జైట్లీ మాట్లాడుతూ... వెంకయ్యనాయుడిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఏ బాధ్యత అప్పజెప్పినా వెంకయ్య నాయుడు సమర్థవంతంగా, చిత్తశుద్ధితో నిర్వర్తించి చూపిస్తారని అన్నారు. వెంకయ్య విద్యార్థి దశ నుంచే ప్రజాసమస్యలపై అవగాహన పెంచుకున్నారని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఆయన నాయకత్వంలో ఆర్థికాభివృద్ధిలో దేశం దూసుకెళుతోందని జైట్లీ అన్నారు. ప్రధాని మోదీ నిరంతరం కష్టపడుతున్నారని అన్నారు. యూపీఏ హయాంలో అభివృద్ధికి పక్షవాతం వచ్చిందని, ఇప్పుడు అభివృద్ధి దిశగా అడుగులేస్తోందని చెప్పారు.