: జైట్లీకి నోరూరించే 50 రకాల వంటకాలతో చంద్రబాబు విందు... మెనూ ఇదే
విజయవాడలోని హోటల్ గేట్ వే లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు అద్భుతమైన విందు ఇస్తున్నారు. నోరూరించే 50 రకాల వంటకాలతో విందు భోజనం రెడీ అయింది. ఇందులో అరుణ్ జైట్లీకి అమిత ఇష్టమైన బెండి ఆమ్ చూర్ తో పాటు ఏపీ స్పెషల్ ఉలవచారు, గోంగూర పచ్చడి, షుగర్ ఫ్రీ జున్ను, పూతరేకులు, బొబ్బట్లు, గోంగూర మటన్, పీతల కూర, టైగర్ ప్రాన్స్, అరటి ఆకుల్లో పత్రి ఫిష్, నాటు కోడి పులుసు, నెల్లూరు చేపల పులుసు, గారెలు, రాయలసీమ స్పెషల్ రాగి సంకటి తదితర వంటకాలు ఉన్నాయి. ఈ విందు కార్యక్రమానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా హాజరవుతున్నారు.