: రోడ్డుపై గాయపడ్డ మహిళను తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లి కాపాడిన ఎమ్మెల్యే రోజా


రోడ్డుపై గాయపడిన వారిని ఎమ్మెల్యేలు ఆసుప‌త్రికి త‌ర‌లించి బాధితుడిని కాపాడే సంఘ‌ట‌న‌లు సినిమాలోనే చూస్తుంటాం. కానీ అటువంటి ఘ‌ట‌నే నిజ‌జీవితంలో జ‌రిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తిరుప‌తి స‌మీపంలోని పాకాల మండలం నేండ్రగుంట వద్ద ఈ రోజు ఉద‌యం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ మహిళను చూశారు. స్కూటీపై వెళుతూ కిందపడిపోవడంతో సింధు అనే మ‌హిళ ఈ ప్ర‌మాదానికి గురైంది. దీంతో రోజా త‌న‌ కారును ఆపి, ఆమెను ఎక్కించుకుని స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. సింధుకి ఆసుప‌త్రితో స‌కాలంలో వైద్యం అందింది. స్థానికులంతా రోజాను అభినందించారు.

  • Loading...

More Telugu News