: 'కాబిల్' ట్రైలర్ కు అదిరిన రెస్పాన్స్.. 10 లక్షల వ్యూస్ @ 48 గంటలు


ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, యామి గౌతమ్ జంటగా నటించిన 'కాబిల్' సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ప్రతీకారం నేపథ్యంలో దృష్టి లోపం ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య సాగిన ప్రేమకథగా 'కాబిల్' తెరకెక్కుతోంది. ఈ సినిమా ట్రైలర్ ను అక్టోబర్ 26న ఈ సినిమా యూనిట్ విడుదల చేయగా, 48 గంటల్లో 10 లక్షల వ్యూస్ రావడం విశేషం. ఈ సందర్భంగా యూనిట్ సినీ ప్రియులకు ధన్యవాదాలు తెలిపింది. ట్రైలర్ లాగే ఈ సినిమా కూడా అందర్నీ అకట్టుకుంటుందని ఈ సినిమా యూనిట్ తెలిపింది. ఈ సినిమాను హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ నిర్మిస్తుండగా, దీనికి సంజయ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News