: తెలుగు వ్యాపారిని అరెస్ట్ చేసిన అమెరికా పోలీసులు
అమెరికాలోని టెక్సాస్ నగరంలో ఓ తెలుగు వ్యాపారిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపార లావాదేవీల్లో మోసాలకు పాల్పడ్డాడనే ఆరోపణలతో నర్సింహ భోగవల్లి అనే వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. గత మూడు నెలల కాలంలో 16,61,247 డాలర్ల డిపాజిట్లను ఆయన సేకరించారు. ఇందులో మోసాలకు పాల్పడ్డాడనే అభియోగాలతో ఆయనను అరెస్ట్ చేశారు.