: వైరల్ గా మారిన మహేష్ బాబు కుమార్తె సితార సినిమా డైలాగ్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార చెప్పిన డైలాగుతో సోషల్ మీడియా మార్మోగిపోతోంది. 'బ్రహ్మోత్సవం' సినిమాలో సమంత డైలాగు చెప్పిన సితార వీడియో ఒకటి షోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో ముద్దుముద్దు మాటలతో "ఏడుతరాల మందా?...వెతికితే దొరకనంతమందా?...కలుస్తే వదులుకోలేనంతమందా?" అన్న డైలాగును వల్లెవేసింది. చిన్నారి సితార తమ అభిమాన హీరో సినిమాలోని డైలాగ్ చెప్పడంతో ఇదిప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కావాలంటే మీరు కూడా ఆ వీడియో చూడండి.