: ఏపీలో 51 బయో కంపెనీలపై కేసుల నమోదు


నకిలీ బయో కంపెనీలను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. ఇలాంటి కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కూడా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 51 బయో కంపెనీలపై కేసులు నమోదు చేశామని మంత్రి తెలిపారు. వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఇలాంటి కంపెనీలన్నీ అనుమతులు పొందాయని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. బ్రహ్మపుత్ర, జీవా కంపెనీలపై పీడీ యాక్ట్ అమలు చేశామని తెలిపారు.

  • Loading...

More Telugu News