: గూఢచర్యం ఆరోపణలపై దౌత్యాధికారిని బహిష్కరించిన గంటల వ్యవధిలోనే ప్రతీకారం తీర్చుకున్న పాకిస్థాన్


ఇండియాలో గూఢచర్యం చేస్తున్నాడన్న ఆరోపణలపై పాకిస్థాన్ కాన్సులేట్ లో పనిచేసే ఉద్యోగిని దేశం నుంచి వెళ్లిపోవాలని భారత్ ఆదేశించిన గంటల వ్యవధిలోనే పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ లోని భారత కాన్సులేట్ లో పనిచేస్తున్న సుర్జీత్ సింగ్ పై వేటు వేసింది. నేటి సాయంత్రంలోగా సుర్జీత్ తన కుటుంబంతో సహా దేశాన్ని విడిచిపోవాలని ఆదేశించింది. వియన్నా సదస్సు నిర్ణయాలు, ద్వైపాక్షిక నిబంధనలకు విరుద్ధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడని చెబుతూ భారత హై కమిషనర్ కు సమన్లు పంపింది. ఆయన్ను వెంటనే ఇండియాకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించింది. కాగా, న్యూఢిల్లీలోని పాక్ హై కమిషన్ ఆఫీసులో పనిచేస్తున్న మహ్మూద్ అఖ్తర్ (35)ను 48 గంటల్లోగా దేశం విడిచి పోవాలని భారత్ ఆదేశించిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ నుంచి వచ్చిన ఇద్దరిని ఢిల్లీ జూపార్కు వద్ద కలుసుకున్న ఆయన, సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారమున్న పత్రాలను స్వీకరిస్తుంటే పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News