: కర్నూలులో అమానవీయ ఘటన.. పసికందు కాళ్లు, చేతులు విరిచేసి పారేశారు!
కర్నూలులో అమానవీయమైన ఘోరం చోటుచేసుకుంది. కర్నూలు ప్రభుత్వాసుపత్రి వద్ద ఓ పసికందు హృదయవిదారక స్థితిలో, గుక్కపట్టి ఏడుస్తూ స్థానికుల కంటబడింది. దీంతో వారు ఆ శిశువును ఆసుపత్రికి తరలించారు. అత్యంత పాశవికంగా ఆ పసికందు బాలిక కాళ్లు, చేతులు విరిచేశారని వైద్యులు నిర్ధారించారు. ఆ బాధ తాళలేక బాలిక ఏడుస్తోందని చెప్పారు. నియోనేటల్ ఐసీయూలో చేర్చిన వైద్యులు పసికందుకు చికిత్స అందిస్తున్నారు. ఇంత రాక్షత్వానికి పాల్పడ్డది ఎవరు? అన్న దిశగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చుట్టుపక్కల సీసీ పుటేజ్ ను పరిశీలిస్తున్నారు. అయితే బాలిక గ్రహణం మొర్రితో జన్మించడం వల్లా? లేక ఆడపిల్ల కావడం వల్ల ఈ దారుణానికి పాల్పడ్డారా? అని ఆరాతీస్తున్నారు.