: అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్ పెన్స్ విమానానికి ప్రమాదం.. ట్రంప్ శిబిరంలో కలవరం!


రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్ పెన్స్ ప్రయాణిస్తున్న విమానం న్యూయార్క్ లోని లగార్డియా విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో స్వల్ప ప్రమాదానికి గురైంది. వర్షం పడి రన్ వేపై నీరు నిలవడంతో ఈ విమానం పక్కకు జారిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది పెన్స్, ఆయన భార్య, పిల్లలు సహా విమానంలోని 31 మందిని క్షేమంగా బయటకు తీసుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ట్రంప్, ఫోన్లో మైక్ పెన్స్ ను పరామర్శించారు. ఈ ఘటన ట్రంప్ వర్గాన్ని కలవరపరచడంతో గురువారం రాత్రి నిర్వహించతలపెట్టిన విరాళాల సేకరణ ప్రోగ్రామ్ ను రద్దు చేసుకున్నారు. గండం గట్టెక్కిందని, విమానంలోని వారంతా క్షేమంగా బయటపడటం ఆనందకరమని ట్రంప్ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. నేటి నుంచి తిరిగి ప్రచారం కొనసాగుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News