: అరుణ్ జైట్లీ, వెంకయ్యకు బాబు విందు


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రభుత్వ శాశ్వత నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్న కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, వెంకయ్యనాయుడుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విందు ఇవ్వనున్నారు. విజయవాడలోని గేట్ వే హోటల్ లో విందు ఏర్పాటు చేసిన ఏపీ సీఎం, విందు సందర్భంగా పలు కోరికలు కోరనున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకప్యాకేజీపై చట్టబద్ధత, ఈఏపీ ప్రాజెక్టు, రాజధాని నిధులపై ప్రకటన చేయాలని ఆయనను చంద్రబాబు కోరనున్నారని తెలుస్తోంది. అలాగే రాజధాని రైతులకు మొదటి అమ్మకంపై కాపిటల్‌ గెయిన్‌ మినహాయించాలని కూడా కోరనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News