: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తప్పిన భారీ అగ్నిప్రమాదం


హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం తప్పింది. ఫ్లయిట్‌ లోకి చేర్చేందుకు ఓ ఏజెంట్ కార్గో ఏరియాకు తీసుకువచ్చిన కెమికల్స్ బాక్సు నుంచి పొగలు వెలువడ్డాయి. దీనిని గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. హుటాహుటీన కెమికల్ బాక్సులను అక్కడి నుంచి దూరంగా తరలించారు. దీంతో అంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. పెనుప్రమాదం తప్పడంతో దీనిని తీవ్రంగా పరిగణించిన ఎయిర్ పోర్టు భద్రత అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News