: భీమవరంలో రౌడీ షీటర్ దారుణ హత్య
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో రౌడీ షీటర్ హత్యకు గురయ్యాడు. బైసాని రామకృష్ణ అనే రౌడీషీటర్ బైక్ పై వెళ్తుండగా, పథకం ప్రకారం అతనిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో నరికి చంపారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. కాగా, బైసాని రామకృష్ణ పాత రౌడీ షీటర్ అని, అతని ప్రత్యర్ధులే అతనిని అంతమొందించి ఉంటారని వారు పేర్కొంటున్నారు. ఈ దిశగా దర్యాప్తు ప్రారంభించారు.