: కాకినాడ జీజీహెచ్ లో శిశువు అపహరణ
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని జీజీహెచ్ లో శిశువు అపహరణకు గురైంది. రాజవొమ్మంగి మండలానికి చెందిన రెడ్డి లక్ష్మి రెండు రోజుల క్రితం పండంటి పాపకు జన్మనిచ్చింది. ఆసుపత్రిలో ఆమె కుటుంబ సభ్యులతో పరిచయం పెంచుకున్న గుర్తుతెలియని మహిళ... వారిని నిద్రపొమ్మని చెప్పి, వారంతా నిద్రలోకి జారుకున్న అనంతరం పాపను పట్టుకుని వెళ్లిపోయింది. నిద్రలేచి చూసిన కుటుంబ సభ్యులు పాప కనిపించకపోవడంతో లబోదిబోమన్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, సీసీటీవీ పుటేజ్ పరిశీలించిన పోలీసులు, ఆ గుర్తుతెలియని మహిళ పాపను ఎత్తుకెళ్లిపోయినట్టు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమె కోసం గాలిస్తున్నారు.