: మద్యం మత్తులో బీరు సీసాతో తమ్ముడ్ని పొడిచిన అన్న


మద్యం మత్తులో బీరు సీసాతో తన సొంత తమ్ముడినే అన్న పొడిచిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. మైలార్‌ దేవ్‌ పల్లిలోని శాస్త్రిపురంలో పూటుగా మందుకొట్టిన అన్న సొంత తమ్ముడిని బీరు సీసాతో పొడిచాడు. తీవ్రగాయాలపాలైన అతనిని స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతున్న అతని పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు కారణాలు ఆరాతీస్తున్నారు.

  • Loading...

More Telugu News