: నేడు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అమరావతి పర్యటన
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. నేటి ఉదయం ప్రత్యేక విమానంలో 11:15 గంటలకు గన్నవరం చేరుకోనున్న అరుణ్ జైట్లీకి ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు ఆహ్వానం పలకనున్నారు. అనంతరం 11:30 నిమిషాలకు బీజేపీ కార్యకర్తలతో సమావేశమవుతారు. 1:05 నిమిషాలకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్యాకేజీ, రైల్వేజోన్, పెండింగ్ ప్రాజెక్టుల వంటి అంశాలపై చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం 3 గంటలకు ఏపీ రాజధాని అమరావతిలో జరగనున్న ప్రభుత్వం భవనాలు, రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.