: ఎన్టీఆర్ ట్రస్టు భవన్ ముందు మావోయిస్టుల కుటుంబ సభ్యుల ఆందోళన...వరవరరావు అరెస్టు
హైదరాబాదులోని జూబ్లిహిల్స్ లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ (టీడీపీ కార్యాలయం) ముందు ఏవోబీలో ఏపీ పోలీసులు చేపట్టిన భారీ ఎన్ కౌంటర్ కు నిరసనగా, హతమైన మావోయిస్టుల కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విరసం నేత వరవరరావు, ప్రజాసంఘాల నేతలు, మావోయిస్టుల బంధుమిత్రులు ఆందోళన నిర్వహించారు. వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ ట్రాఫిక్ జాం నెలకొంది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.