: గూఢచర్యం చేస్తూ పట్టుబడ్డ ‘పాక్ హైకమిషన్’ ఉద్యోగికి నకిలీ ఆధార్ కార్డ్ వుందట!
గూఢచర్యానికి పాల్పడ్డ ‘పాక్ హైకమిషన్’ ఉద్యోగి మహమూద్ అక్తర్ ను 48 గంటల్లోగా దేశం విడిచి పోవాలంటూ భారత్ అధికారులు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహమూద్ అక్తర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.. * పాకిస్థాన్ హై కమిషన్ లోని వీసా సెక్షన్ లో పని * బలోచ్ రెజిమెంట్ లో హవల్దార్ అయిన మహమూద్ 2013 జనవరి నుంచి డెప్యుటేషన్ పై ఇంటర్- సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కు * మహమూద్ కు మెహబూబ్ రాజ్ పుట్ పేరిట నకిలీ ఆధార్ కార్డు కూడా వుంది * గూఢచర్యం చేస్తూ పట్టుబడ్డ సమయంలో ఢిల్లీలోని చాందినీ చౌక్ నివాసిగా చెప్పుకున్న మహమూద్